జనవరి 18న నవోదయ ప్రవేశ పరీక్ష! 8 d ago
దేశవ్యాప్తంగా ఉన్న 653 జవహర్ నవోదయ విద్యాలయాలలో ఆరో తరగతిలో ప్రవేశాలకు జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2025 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 18న జరగనుంది. ఫలితాలను మార్చి నెలలో వెల్లడించనున్నారు. ఈ పరీక్ష నిర్వహణకు కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వశాఖ సమాయత్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ఇందులో ఎంపికైన విద్యార్ధులకు 6వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు ఉచిత విద్యని అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్ధులను ఎంపిక చేస్తారు.